Header Banner

రూ. 22వేల కోట్లతో ఆ జిల్లాలో రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్! దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్!

  Wed May 14, 2025 14:52        Politics

రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తెచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ (ICE)తో పెద్దఎత్తున పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఎపికి క్యూకడుతున్నాయి. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ రూ.22వేల కోట్లతో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఈనెల 16వతేదీన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మంత్రి లోకేష్, రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా నడుమ జరిగిన వ్యూహాత్మక చర్చలు ఫలించడంతో  లోకేష్ ఆరేళ్ల తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూ పవర్ ముందుకు వచ్చింది.

 

రెన్యూ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు భారతదేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు తొలిదశలో రెన్యూ సంస్థ 587మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లపై రూ.7 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లపై మొత్తంగా 22 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ గా ఆవిర్భవించడమే గాక ఎపి క్లీన్ ఎనర్జీ కెపాసిటీ, గ్రిడ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. 2019కి ముందు 777 మెగావాట్ల సామర్థ్యంతో ఎపి పునరుత్పాదక ఇంధనరంగంలో ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్న రెన్యూ... ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచక విధానాలతో పెట్టుబడులు పెట్టడం ఆపేసింది. టిడిపి ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న పిపిఎలన్నింటినీ జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దుచేసింది. వైసిపి ప్రభుత్వ అనాలోచిత చర్యలతో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం జీరోస్థాయికి పడిపోయింది.

 

ఇది కూడా చదవండి: అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థి బహమాస్ లో మృతి! ఈ విషాదకర సంఘటనపై..

 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పునరుత్పాదక ఇంధన రంగం మళ్లీ పట్టాలెక్కింది. గత ఏడాది అక్టోబర్ లో క్లీన్ ఎనర్జీ పాలసీని ప్రభుత్వం విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను దావోస్ చర్చల్లో మంత్రి లోకేష్ రెన్యూ పవర్ చైర్మన్ కు వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఫాస్ట్-ట్రాక్ అనుమతులు, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు పునరుత్పాదక ఇంధనరంగంలో పెద్దఎత్తున పెట్టుబడులకు మార్గం సుగమం చేయడమేగాక పెట్టుబడిదారుల్లో  విశ్వాసాన్ని నింపాయి. దీంతో పునరుత్పాదక ఇంధనరంగంలో పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. వచ్చే ఐదేళ్లలో 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్న మంత్రి నారా లోకేష్ ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు. దీంతో పునరుత్పాదక ఇంధనరంగంలో పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.65వేలకోట్లతో 500 సిబిజి ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు రాగా, కనిగిరిలో తొలిప్లాంట్ కు మంత్రి లోకేష్ ఇటీవల భూమిపూజ చేశారు. టాటా పవర్ (7వేల మెగావాట్లు, రూ.49వేలకోట్ల పెట్టుబడి), ఎన్ టి పిసి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు (రూ.1.86లక్షల కోట్లు), వేదాంత అనుబంధ సంస్థ సెరెంటికా (10వేల మెగావాట్లు, రూ.50వేల కోట్లు), ఎస్ఎఈఎల్ ఇండస్ట్రీస్ (1200 మెగావాట్లు, 6వేలకోట్ల పెట్టుబడులు), బ్రూక్ ఫీల్డ్ (8వేల మెగావాట్లు, రూ.50వేలకోట్ల పెట్టుబడి) తదితర ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. రాబోయేరోజుల్లో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా నిలవనుంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ప్రధాని మోడీ కీలక సమావేశం.. ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్! ఎప్పుడు అంటే.?

 

వైసీపీకి మరో బిగ్ షాక్‌! కీలక నేత పార్టీకి రాజీనామా!

 

నమ్మి మోసపోయాను..! కొడాలి నానిపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!

 

ఏపీకి క్యూ కట్టనున్న కంపెనీలు.. ఎన్నో తెలుసా? నారా లోకేష్ కీలక ప్రకటన!

 

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting